(Local) Wed, 21 Aug, 2019

ఇమ్రాన్ నిర్ణయంతో ..కరువైన పండగ సందడి

August 09, 2019,   9:18 PM IST
Share on:

పాకిస్తాన్ లో అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పండగపూట అక్కడి ప్రజల నెత్తిన పిడుగుపడినట్టైంది. తాజా నిర్ణయంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్తానీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. వెనకా ముందూ ఆలోచించకుండా భారత్‌తో వాణిజ్యాన్ని సస్పెండ్ చేయడంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. భారత్ నుంచి ఆహార దిగుమతులు నిషేధంతో ఈసారి ఈద్ నాడు తమకు కష్టాలు తప్పవని సామాన్య ప్రజలు, వ్యాపారులు దిగులు చెందుతున్నారు. భారత్‌తో వాణిజ్యం నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ మార్కెట్‌పై మరింత ప్రభావం పడుతుందంటూ వీధి వ్యాపారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈద్ పండుగకు ఇంకా రెండు మూడు రోజులే ఉన్నా మార్కెట్‌లో సందడి లేదు.

సంబంధిత వర్గం

టెస్టు సిరీస్‌ కి ముందు...తుది జట్టు కూర్పు కై తర్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.