(Local) Sun, 20 Sep, 2020

గూగుల్ ఉద్యోగుల ఆందోళన

November 24, 2019,   11:58 AM IST
Share on:
గూగుల్ ఉద్యోగుల ఆందోళన

గూగుల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గూగుల్ తన ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఇద్దరు ఉద్యోగులను సెలవులపై పంపడంపై ప్రశ్నిస్తూ.. గూగుల్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. సంస్థలో జరుగుతున్న లైంగిక వేధింపులపై సరైన చర్యలు తీసుకోవాలని, నేను, నా తోటి ఉద్యోగులము అడుతున్నామని, అదే సమయంలో పరిస్థితులను మెరుగ్గా చేయాలని కోరుతున్నా గూగుల్ పట్టించుకోవడం లేదు. చర్యలు తీసుకోకుండా మమ్మల్నే నోరు మూసుకొని ఉండాలని సంస్థ చెబుతుందని గూగుల్ సాఫ్ట్ వేర్ లో పనిచేసే ఇంజినీర్ జోరతాంగ్ అన్నారు. ఈనెల మొదటి వారంలో ఇద్దరు ఉద్యోగులు కంపెనీకి వ్యతిరేకంగా పనిచేయడంతో సెలవులపై పంపించినట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.