(Local) Wed, 24 Jul, 2019

రూ. 241 కోట్లతో పారిపోయిన దుబాయ్ రాణి

June 30, 2019,   12:29 PM IST
Share on:

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (69) భార్య  హయా అల్ హుస్సేన్ (45) రూ. 241 కోట్లతో లండన్ కు పారిపోయింది. ఇటీవలే ఆమె తన భర్త షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో విడిపోయింది. తన ఇద్దరు పిల్లలను తీసుకుని లండన్ పారిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆమె దారుణంగా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. జర్మనీకి చెందిన ఓ రాయబారి సాయంతో ఆమె లండన్ కు పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. జర్మనీలో తనకు ఆశ్రయం కల్పించాలని హయా అల్ హుస్సేన్ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలుస్తోంది. జోర్డన్ రాజుకు హయా అల్ హుస్సేన్ సొదరి అన్న విషయం తెలిసిందే. 2004 లో హయా అల్ హుస్సేన్ దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను వివాహం చేసుకుంది. విడాకుల అనంతరం తన ప్రాణాలకు ముప్పు ఉందని హయా అల్ హుస్సేన్ ఆరోపించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హయా అల్ హుస్సేన్ వ్యవహారంపై దుబాయ్ ప్రభుత్వం, ఇంగ్లండ్ ప్రభుత్వం స్పందించలేదు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.