(Local) Sun, 20 Oct, 2019

బిన్ లాడెన్ కుమారుడు హతం: వైట్ హౌస్ ప్రకటన

September 14, 2019,   8:57 PM IST
Share on:
బిన్ లాడెన్ కుమారుడు హతం: వైట్ హౌస్ ప్రకటన

ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ను హతమార్చినట్లు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. తండ్రి మృతి తర్వాత అల్ ఖైదా‌కు వారసుడిగా ఉన్న హమ్జా మృతికి సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఎన్‌బీసీ వార్తా సంస్థ వెల్లడించింది. హమ్జా మృతిని అమెరికా అధికారులు కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది.2017లో హమ్జా బిన్ లాడెన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా అతడిపై మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. కాగా, అమెరికా మీడియా మొత్తం హమ్జా మృతిపై కోడై కూస్తుండగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని చెప్పడం గమనార్హం.

ఒసామా బిన్ లాడెన్‌కు చెందిన 20 మంది పిల్లలలో 15వ సంతానమైన హమ్జా బిన్ లాడెన్‌కు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని అంచనా. ఒసామా మూడవ భార్యకు పుట్టిన హమ్జా అల్ ఖైదాలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ అతని తలపై 10 లక్షల డాలర్ల బహుమానాన్ని ప్రకటించింది. బహుశా అతను మరణించిన తర్వాత ఈ బహుమానాన్ని ప్రకటించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near 'HamzabinLadendead|hehisheirofAlQaedafounderOsamabinLaden|uspresidenttrumpconfirm' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.