(Local) Sat, 14 Dec, 2019

డొనాల్డ్‌  ట్రంప్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు -హసన్‌ రౌహానీ

June 17, 2019,   11:39 AM IST
Share on:
డొనాల్డ్‌  ట్రంప్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం మాక ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని ఇరాన్‌ అద్యక్షుడు హసన్‌ రౌహానీ జపాన్‌ ప్రధాని షింజో అబేతో అన్నారు.ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణ అంశంపై షింజో అబే రౌహానీతో చర్చించారు. ట్రంప్‌ పంపిన సందేశాన్ని షింజో అబే ఇరాన్‌ ముందుంచారు. అయితే, ట్రంప్‌కు తిరిగి సమాధానం ఇవ్వాల్సినంత గౌరవం ఆయన ఉంచుకోలేదని రౌహాని మండిపడ్డారు ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే బాధ్యత జపాన్‌ తీసుకుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.