(Local) Mon, 22 Jul, 2019

ఆర్ధిక నేరగాడు నీరవ్‌ మోడీకి మరో ఎదురుదెబ్బ

June 27, 2019,   3:00 PM IST
Share on:

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోడీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన నాలుగు స్విస్‌ బ్యాంక్ కు చెందిన ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. ఆయన సోదరి పూర్వీ మోదీ ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లు ప్రకటన వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ చేసిన వినతి ఆధారంగా అక్కడి అధికారులు ఈ ఖాతాలను స్తంభింపజేశారు. అలాగే.. నీరవ్‌ మోదీ లండన్‌కు పారిపోయి అక్కడ తలదాచుకోగా కొన్ని వారాల క్రితం ఆయనను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. నీరవ్‌ మోదీ పలుసార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేయగా అవసరమైనప్పుడు ఆయన లొంగిపోడేమోనన్న సంశయంతో బెయిల్‌ ఇవ్వడానికి న్యాయమూర్తులు నిరాకరించారు. ఇప్పటికి ఆయనపై ఉన్న ఆరోపణలపై న్యాయస్థానం పలుసార్లు విచారించింది. గురువారం ఆయనను లండన్‌లోని ఓ న్యాయస్థానంలో మరోసారి విచారించనుంది. ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఆయన వీడియో లింక్‌ ద్వారా విచారణకు హాజరుకావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.