(Local) Sun, 05 Jul, 2020

అమెరికాలో దారుణం..హైదరాబాద్ యువతి హత్య

November 26, 2019,   12:52 PM IST
Share on:
అమెరికాలో దారుణం..హైదరాబాద్ యువతి హత్య

అమెరికాలో దారుణం జరిగింది. హైదరాబాద్ కు చెందిన 19 సంవత్సరాల ఇండో అమెరికన్  యువతి పై ఓ ప్రేమోన్మాది అత్యాచారం చేసి హత్య చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం అమెరికాలోని ఇల్లినాయిస్ లో స్థిరపడింది.  వారి కుమార్తె, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో ఆనర్స్‌ విద్యార్థిని. గత కొంత కాలంగా డొనాల్డ్ తుర్కాన్ అనే యువకుడు యువతిని వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె తిరస్కరించడంతో తుర్కాన్ ఆమె పై పగ పెంచుకున్నాడు. 

శుక్రవారం సాయంత్రం నుంచి తమ బిడ్డ కనిపించడం లేదని వర్సిటి పోలీసులకు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తాను చదువుతున్న యూనివర్సిటి ప్రాంగణం వెనుక వైపున ఉన్న గ్యారేజ్ లో కారు వెనుక సీటులో విగత జీవిగా యువతిని గుర్తించారు. సీసీ టీవీల ఆధారంగా తుర్కాన్ దుశ్చర్యను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి పై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. డాక్టర్ కావాలనుకున్న యువతి దారుణ హత్యకు గురికావడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.