(Local) Sat, 07 Dec, 2019

పీకేకు జగన్ చెల్లించిన రెమ్యూనరేషన్ బయటికొచ్చింది

November 18, 2019,   10:13 AM IST
Share on:
పీకేకు జగన్ చెల్లించిన రెమ్యూనరేషన్ బయటికొచ్చింది

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సీఎం జగన్ ఎంత చెల్లించారనే దాని పై క్లారిటి వచ్చింది. ఎన్నికలకు ముందు సీఎం జగన్ పీకే టీంతో భేటి అయిన విషయం తెలిసిందే. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో పీకే టీంకు మంచి పేరుంది. అలానే పీకే టీంతో జత కట్టిన తర్వాత సీఎం జగన్ ఆయన చెప్పినట్టు విన్నారు. అసెంబ్లీ ఎన్నిలక సమయాన అభ్యర్దులు ఎంపికను కూడా పీకే చెప్పినట్టే జగన్ చేశారు. దాని ఫలితంగా 151 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. అయితే పీకేకు జగన్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారనే దాని పై తీవ్ర చర్చ జరిగింది. కానీ అది బయటికి రాలేదు. ప్రస్తుతం అధికారికంగా దానికి సంబంధించిన లెక్కను వైసీపీ వెల్లడించింది. పీకే పెట్టిన  పొలిటికల్ కన్సల్టెన్సీ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి రూ.37.57 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్టు వైసీపీ తన వ్యయ ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.