(Local) Tue, 02 Mar, 2021

బాలీవుడ్ ప్రముఖ నటి ఆరోగ్య పరిస్థితి విషమం....

August 10, 2019,   6:03 PM IST
Share on:
బాలీవుడ్ ప్రముఖ నటి ఆరోగ్య పరిస్థితి విషమం....

బాలీవుడ్ సీనియర్ నటి విద్యా సిన్హా(71) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఐసియులో చికిత్స పొందుతోంది. గుండె, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాదులతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. శనివారం పల్స్‌రేట్‌ పడిపోవడంతో ముంబైలోని క్రిటికేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు.ఆమె ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని డాక్టర్లు తెలిపారు. పతి పత్ని ఔర్ వొ, రజ్నిగంధా, ఛోటి సి బాత్ వంటి హిట్ సినిమాలలో ఆమె నటించారు. సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ సినిమాలో విద్య నటించారు. కావ్యాంజలి టెలివిజన్ సీరియల్‌లో ఏక్తా కపూర్‌తో కలిసి నటించారు. 1968లో నటుడు వెంకటేశ్వరన్ ను ఆమె పెళ్లి చేసుకుంది. వెంకటేశ్వరన్ 1996లో మరణించిన తరువాత 2001లో భీమ్ రావు సులేంఖ్‌ను విద్యా సిన్హా రెండో పెళ్లి చేసుకుంది. 2009లో  రెండో భర్తతో ఆమె విడాకులు తీసుకున్నారు. రెండో భర్తపై గృహ హింస కేసు కూడా పెట్టారు.

సంబంధిత వర్గం
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్
పిక్ టాక్: నెటిజెన్లకు బికినీ ట్రీట్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.