(Local) Tue, 22 Sep, 2020

'గ్యాంగ్‌ లీడర్‌' కి దారిచ్చిన 'వాల్మీకి'...

August 28, 2019,   11:28 AM IST
Share on:
'గ్యాంగ్‌ లీడర్‌' కి దారిచ్చిన 'వాల్మీకి'...

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ్ చిత్రం హిట్‌ జిగర్తాండాకు ను రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ జిగర్తాండా లో బాబీ సింహా రోల్ వరుణ్ తేజ్ చేస్తుండగా, సిద్దార్థ్ చేసిన క్యారెక్టర్‌లో యంగ్ తమిళ హీరో అధర్వ నటిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన టీజర్ అండ్ సాంగ్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 13న విడుదల కావాల్సిన వాల్మీకిని మరోసారి వాయిదా వేశారు నిర్మాతలు. మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. వేరే సినిమాలతో కాంపిటీషన్ కారణంగా డేట్ విషయంలో వెనక్కితగ్గి సెప్టెంబర్ 13కి షిఫ్ట్ అయ్యారు. అయితే అదే రోజు నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' విడుదల కానుండడంతో, రెండు సినిమాల నిర్మాతలు చర్చించుకొని.... క్లాష్ ఎందుకని భావించి తమ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు, సెప్టెంబర్ 20న విడుదల చెయ్యనున్నట్టు వాల్మీకి నిర్మాతలు ప్రకటించారు.

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.