(Local) Mon, 09 Dec, 2019

పంట వ్యర్ధాల దహనాన్ని నిర్ములించే దిశగా చర్యలు

November 18, 2019,   11:07 AM IST
Share on:
పంట వ్యర్ధాల దహనాన్ని నిర్ములించే దిశగా చర్యలు

పలు ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పంట పూర్తయిన తర్వాత దహనం చేస్తున్న విషయం తెలిసిందే. వాటి ప్రభావం దేశ రాజధాని దిల్లీపై పడుతుండడంతో అక్కడ కాలుష్యం తారాస్థాయికి చేరుకుని గాలి నాణ్యత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంటవ్యర్థాల దహనాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సూచనలతో  పంట వ్యర్ధాల దహనాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్రాలు కదులుతున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ఈ విషయమై అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు సీఎం యోగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌పీ గోయెల్‌తో సమావేశమై పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఇలాంటి చర్యలు మానుకొని సేంద్రీయ ఎరువులుగా ఉపయోగించుకునేలా సంబంధిత అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.