(Local) Sun, 27 Sep, 2020

తమిళనాడు సిఎం ను కలిసిన టిటిడి చైర్మన్

August 23, 2019,   4:14 PM IST
Share on:
తమిళనాడు సిఎం ను కలిసిన టిటిడి చైర్మన్

తమిళనాడు సిఎం పళనిస్వామితో టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తిరుమలలో చేపడుతున్నసేవా కార్యక్రమాల గురించి ఆయన పళనిస్వామికి వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో పలు సంస్కరణలు చేపడుతున్నట్టు సుబ్బారెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని టిటిడి విధివిధానాలను రూపొందించిందని ఆయన పళనిస్వామికి చెప్పారు.  భక్తులకు మరింత సులభంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు సిఎం పళనిస్వామి పలు సూచనలు చేశారు. టిటిడి అభివృద్ధిపై వీరిద్దరు గంట పాటు చర్చించారు. పళనిస్వామిని కలిసిన నేపథ్యంలో సుబ్బారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించి, శాలువాతో సత్కరించారు.

సంబంధిత వర్గం
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే
గవర్నర్ ని కలిసిన ఉద్దవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.