(Local) Fri, 07 May, 2021

హుజుర్ నగర్ లో గులాబీ బాస్ పర్యటన డౌటే ?

October 14, 2019,   11:45 AM IST
Share on:
హుజుర్ నగర్ లో గులాబీ బాస్ పర్యటన డౌటే ?

సీఎం కేసీఆర్ హుజుర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడం పై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 21న ఉపఎన్నిక జరగనుంది. ఈ నెల 19న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దీంతో సీఎం కేసీఆర్ ఈ నెల 17న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని షెడ్యూల్ ఖరారైంది. కానీ అనూహ్యంగా ఆర్టీసి సమ్మె ఉధృతంగా జరుగుతుండడంతో ప్రజలల్లో వ్యతిరేకత పెల్లుబికే అవకాశం ఉందని గులాబీ నేతలు బాస్ కు సూచించారు. దీంతో పాటు పలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్న సందర్భంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకొని నిరసన తెలిపారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నాలుగైదు రోడ్ షోలు నిర్వహించాల్సి ఉండగా కేవలం ఒక్క రోడ్ షోతోనే సరిపెట్టారు. మిగిలిన రోడ్ షోలు రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో సీఎం కేసీఆర్ సభకు వెళితే ప్రజలల్లో ఏం చెప్పినా ఆర్టీసి సమ్మెనే వినిపిస్తుందని, అక్కడికి వెళ్లి ఇబ్బంది పడేదానికంటే సభకు వెళ్లకపోవడమే మంచిదన్న భావనలో సీఎం కేసీఆర్ ఉన్నారని గులాబీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.