
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి....అనే సామెత పాటించేవారిలో కొంతమంది సెలబ్రిటీస్ ముందుంటారు. వెండితెర,బుల్లితెర, వాణిజ్య ప్రకటనలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్....ఇలా ఒకటేంటి ఎన్నిఅవకాశాలు వచ్చిన వాటిని అంది బుచ్చుకోవడం అనేది అతికొద్ది మంది చేస్తుంటారు. అలాంటి వాళ్ళలో అక్కినేని వారలు కోడలు ఒకరు...సినిమా తారలు వెబ్‌సిరీస్‌లలో నటించడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్. ఎలాంటి సెన్సారూ లేకపోవడంతో అవి జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు వెబ్‌సిరీస్‌లలో నటించేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత అక్కినేని కూడా చేరిపోయారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్2 లో ఆమె నటిస్తోంది. ఈ విషయాన్ని దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ట్విటర్లో ప్రకటించారు. సమంత పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని వారు పేర్కొన్నారు. ‘సీజన్ 2 షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కు వెళ్లాడు. త్వరలోనే తాను వస్తాడని మేము ప్రామిస్ చేస్తున్నాం’ అని తెలిపారు. గురువారం నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
మరోవైపు సమంత కూడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇందుకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను నటించబోతున్న మొదటి వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. దీని కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఓ డ్రీమ్ రోల్‌ను నాకు ఇచ్చినందుకు ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని సమంత వెల్లడించారు. సీజన్ 1లో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ముఖ్య పాత్రలో నటించాడు. మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థకు ఏజెంట్‌గా పనిచేస్తాడు. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రియమణి, నీరజ్ మాధవ్, పవన్ చోప్రా, కిషోర్ కుమార్ తదితరులు నటించారు.
-
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
27 Nov 2019, 1:10 PM
-
చైతూ బర్త్‌డే.. సామ్ హార్ట్ టచింగ్ పోస్ట్
23 Nov 2019, 7:25 PM
-
భూమిక 2009 ఫోజ్!!
18 Nov 2019, 11:32 PM
-
సూపర్ స్టార్ 'మహర్షి' ఖాతాలో మరో ఘనత....
13 Nov 2019, 5:01 PM
-
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్బుక్ పే
13 Nov 2019, 1:52 PM
-
ట్రంప్ హయాంలో అత్యధికంగా హెచ్-1బి వీసాలు తిరస్కర ...
06 Nov 2019, 1:53 PM
-
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం
31 Oct 2019, 1:48 PM
-
ఈ ఎమెజీలు వాడితే.. మీ అకౌంట్ చిక్కుల్లోపడ్డట్టే...
31 Oct 2019, 10:50 AM
-
కూపన్ కోడ్‌లో పొరపాటు.. అమెజాన్‌ను ఖాళీ చేసిన విద్ ...
29 Oct 2019, 1:38 PM
-
అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...
21 Oct 2019, 5:48 PM
-
ఆరు బంతుల్లో ఐదు వికెట్లు
30 Nov 2019, 4:08 PM
-
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
30 Nov 2019, 4:05 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
30 Nov 2019, 3:45 PM
-
డిసెంబర్ 11 .. పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం..
30 Nov 2019, 3:41 PM
-
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
30 Nov 2019, 3:34 PM
-
ఆ అమ్మాయిని ఎలా చంపారో నా కొడుకును అలాగే చంపండి
30 Nov 2019, 3:27 PM
-
బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...
30 Nov 2019, 3:23 PM
-
జపాన్ మాజీ ప్రధాని మృతి
30 Nov 2019, 3:14 PM
-
విద్యారంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టిన వైఎస్ ...
30 Nov 2019, 3:12 PM
-
జార్ఖండ్ లో బీజేపీకి 45-48 సీట్లు
30 Nov 2019, 3:03 PM
-
షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
30 Nov 2019, 2:07 PM
-
మూడో అతిపెద్ద విమానాశ్రయంగా జేవార్ ఎయిర్పోర్ట్
30 Nov 2019, 1:41 PM
-
వీడిన ప్రియాంకరెడ్డి హత్యకేసు మిస్టరీ
30 Nov 2019, 1:37 PM
-
ఫోర్బ్స్ జాబితాలో 9వ స్థానం లో ముకేశ్ అంబానీ
30 Nov 2019, 1:23 PM
-
హైదరాబాద్‌లో ఇంటెల్‌లో పరిశోధన కేంద్రం
30 Nov 2019, 1:19 PM
-
ఉద్యమకారులకు మద్దతుగా ట్రంప్
30 Nov 2019, 1:15 PM

కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.