(Local) Wed, 21 Aug, 2019

భట్టి విక్రమార్క ఆమరణ దీక్ష భగ్నం

June 10, 2019,   1:44 PM IST
Share on:

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఆయనను అరెస్ట్ చేసి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇందిరా పార్క్ వద్ద కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఆయన ఈనెల 8 నుంచి ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇతర ముఖ్యులు వచ్చి భట్టి విక్రమార్కకు సంఘీభావం తెలిపారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.