(Local) Sat, 26 Sep, 2020

ఇంటర్ వివాదం ఓ కుట్ర : సీఎం కేసీఆర్

August 16, 2019,   12:06 PM IST
Share on:
ఇంటర్ వివాదం ఓ కుట్ర : సీఎం కేసీఆర్

ఇంటర్ ఫలితాల వివాదం కుట్రపూరితమని సీఎం కేసీఆర్ గవర్నర్ తో అన్నారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లో జరిగిన తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్ తో సీఎం కేసీఆర్ ఈ విషయం పై చర్చించారని సమాచారం. ప్రతిపక్షాలు కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించాయని, ప్రభుత్వాన్ని బద్ నాం చేశాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఫలితాల్లో తప్పిదం తెలియగానే సర్కార్ వెంటనే రక్షణ చర్యలు చేపట్టిందని, కానీ వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకునేందుకు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నారని ఆయన విమర్శించారు. అదే విధంగా నూతన అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు, ప్రస్తుతం ప్రాజెక్టుల పరిస్థితి పై సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు వివరించారు.

సంబంధిత వర్గం
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల ఖరారు .

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.