(Local) Fri, 17 Sep, 2021

చరిత్ర పుటల్లో కనుమరుగయినా వీరుడి కథ.....సైరా టీజర్

August 20, 2019,   4:07 PM IST
Share on:
చరిత్ర పుటల్లో కనుమరుగయినా వీరుడి కథ.....సైరా టీజర ...

రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం స్వతంత్ర సమరయోధుడు రేనాటి సూర్యుడుగా కొలవబడే  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరెకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 151వ చిత్రం మాత్రమే కాదు....ఈ సినిమా చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అత్యంత బారి బడ్జెట్ తో మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించించారు.  ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మెగా అభిమానులకు పండగలాంటి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు రెండురోజుల ముందే సైరా మూవీ టీజర్ ముంబాయి లో రామ్ చరణ్ విడుదల చేశారు. మొత్తం అయిదు బాషలలో విడుదలైన ఈ చిత్ర టీజర్ కి పలువురు స్టార్స్ వాయిస్ ఓవర్ అందించారు. తెలుగులో టీజర్ కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పగా మిగత లాంగ్వేజ్ లో ఈ సైరా టీజర్ కి హిందీలో బిగ్ బి వాయిస్ చెప్పారు, తమిళ టీజర్ కి సూపర్ స్టార్ రజిని వాయిస్ ఇవ్వగా, కన్నడలో కెజిఫ్ స్టార్ యాష్, మలయాళంలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గాత్రదానం చేసారు. 

టీజర్ పవన్ కళ్యాణ్ చెప్పిన.. “చరిత్ర స్మరించుకుంటుంది…,చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీ భాయ్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలని…, కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు, ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యడు” అనే వాయిస్ ఓవర్ డైలాగ్ తో మొదలైంది. దాదాపు ఒకటిన్నర నిమిషానికి పైగా నిడివి గల సైరా టీజర్ అద్భుతంగా సాగింది. చరిత్ర గతిన పడిపోయిన ఓ విప్లవ వీరుని గాధ సైరా చిత్రం కొంచెం కాల్పనికత జోడించి తీశారని తెలుస్తుంది. ఇక టీజర్ లో ‘సింహం లాంటోడు దొర’, ‘అతడే వాళ్ళ ధైర్యం దొర’ అనే డైలాగ్, అలానే …రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కాని చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ మెగాస్టార్ పలికే పవర్ ఫుల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. మొత్తంగా ఈ టీజర్ రిలీజ్ తరువాత సైరా పై ప్రేక్షకుల్లో, మెగాభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు సుదీప్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు జగపతి బాబు, హీరోయిన్ తమన్నా, నిహారిక కొణిదెల తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ స్టోరీని అందించిన ఈ సినిమాకు మాటలను సాయి మాధవ్ బుర్ర, సినిమాటోగ్రఫీని రత్నవేలు, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్టు ట్రైలర్ లో అధికారికంగా ప్రకటించారు.

సంబంధిత వర్గం
వెబ్ సిరీస్‌లో నటించనున్న  తమన్నా
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.