(Local) Fri, 22 Oct, 2021

ఇతర బాషలలో మార్కెట్ అందుకోలేకపోతున్న....సైరా

August 17, 2019,   11:46 AM IST
Share on:
ఇతర బాషలలో మార్కెట్ అందుకోలేకపోతున్న....సైరా

ఒకప్పుడు మెగాస్టార్ మూవీ వస్తోంది అనగానే అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఎప్పడెప్పుడా అని ఎదురుచూసేవారు. ఆయన సినిమాను కొనడానికి బయ్యర్లు పోటీపడుతుంటారు. అయితే అది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. ఎందుకంటే చిరంజీవి మనకు మెగాస్టార్.. బయట ఇండస్ట్రీలకు ఆయన ఒక హీరో మాత్రమే. చిరంజీవి అంటే ఉన్న ఇమేజ్ తెలంగాణ ఆంధ్రలో మాత్రమే పని చేస్తుంది. ఇప్పుడు సైరా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నేషనల్ వైడ్ ప్రాజెక్టు అంటూ రామ్ చరణ్ ఈ సినిమాను దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మిస్తున్నాడు. అయితే బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది. తెలుగులో భారీగానే బిజినెస్ చేస్తున్న సైరా నరసింహారెడ్డి.. హిందీలో మాత్రం చాలా తక్కువతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ ఈ సినిమాలు 40 కోట్ల రేంజ్ లోనే ఫర్హాన్ అక్తర్ తీసుకున్నాడు. 50 కోట్ల వరకు హిందీ రైట్స్ అమ్మాలని చరణ్ ఎంత ప్రయత్నించినా కూడా అది వర్కౌట్ కాలేదు. పైగా అందులో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు కాబట్టి 40 కోట్ల వరకు రైట్స్ తీసుకున్నారని.. ఆయన కూడా లేకపోయి ఉంటే పరిస్థితి మరింత తక్కువగా ఉండేదని తెలుస్తోంది. చిరంజీవి మెగాస్టార్ అయినా కూడా హిందీలో ఆయనకు అంత మార్కెట్ లేదనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఇదే సమయంలో సాహో సినిమా రైట్స్ మాత్రం 80 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. దీనికి కారణం బాహుబలి సినిమా అక్కడ 600 కోట్ల వరకు వసూలు చేసింది. అందుకే ప్రభాస్ పై నమ్మకంతో సాహోను భారీ రేటుకు కొన్నారు. బిజినెస్ విషయంలో సాహో, సైరా మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విషయంలో చిరంజీవి కంటే ప్రభాస్ చాలా ముందున్నాడు. ఆగస్టు 30న సాహో.. అక్టోబర్ 2న సైరా విడుదల కానున్నాయి.

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.