(Local) Fri, 22 Oct, 2021

సూర్య..‘ఆకాశం నీ హద్దురా' ఫస్ట్ లుక్ రిలీజ్....

November 12, 2019,   2:07 PM IST
Share on:
సూర్య..‘ఆకాశం నీ హద్దురా' ఫస్ట్ లుక్ రిలీజ్....

2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం 'సురరై పోట్రుగా'...ఈ చిత్రానికి తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన అపర్ణ బాలమురలి కథానాయికగా నటిస్తుండగా లేడీ డైరెక్టర్‌ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘గురు’సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న లేడీ డైరెక్టర్‌ సుధా కొంగర చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తుండటం విశేషం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ హీరో సూర్య ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో సూర్య చొక్కా లేకుండా నల్లని బనియన్‌తో మరింత ఫిట్‌గా అభిమానులను మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం సూర్యకు సంబంధించిన లుక్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో సూర్య పైలట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన 'కెప్టెన్‌ గోపీనాథ్‌' జీవితాధారంగా రూపొందుతున్న ఈ మూవీలో కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ చిత్రానికి జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, తమిళ, తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. జాకీష్రాఫ్, కరుణాస్‌లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

సంబంధిత వర్గం
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్
చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.