(Local) Fri, 25 Sep, 2020

రణరంగం బాగోలేదని ఎవరూ అనలేదు....శ్వరా

August 19, 2019,   4:06 PM IST
Share on:
రణరంగం బాగోలేదని ఎవరూ అనలేదు....శ్వరా

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్‌, కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “రణరంగం”.  ఈ నెల ఆగష్టు 15న విడుదలైన ఈ మూవీకి తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. శర్వానంద్ కెరీర్‌లో రికార్డు ఓపెనింగ్స్ అందించిన సినిమాగా “రణరంగం” నిలిచింది. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఈ సినిమా ఫలితం గురించి తాజాగా శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. “రణరంగం బాగోలేదని ఎవరూ అనలేదు. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం నేను తికమకలో ఉన్నాను. తప్పు ఎక్కడ జరుగుతోందో అర్థం కావడం లేదు. సినిమా గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. చిత్రపరిశ్రమ నుంచి ఒకలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ప్రేక్షకులు ఒకలా చెబుతున్నారు. విమర్శకులు మరోలా మాట్లాడుతున్నారు. అందుకే తర్వాతి సినిమా ఎలా ఉండాలో నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను” అని శర్వా అన్నాడు

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్ళి సీక్వెల్ లో రాబోతున్న అ! ప్ర‌యోగాత్మ‌క చిత్ర ...
మళ్ళి సీక్వెల్ లో రాబోతున్న అ! ప్ర‌యోగాత్మ‌క చిత్ర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.