(Local) Wed, 21 Oct, 2020

రూ.15 కే టన్ను ఇసుక

August 26, 2019,   11:16 AM IST
Share on:
రూ.15 కే టన్ను ఇసుక

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విధానం మళ్లీ మొదటికొచ్చింది. కాంట్రాక్టర్లు వేసిన టెండర్లకు అందరికీ షాక్ తగిలేలా ఉంది. రూ.15 కే టన్ను ఇసుక లోడింగ్, అన్ లోడింగ్ అంటూ విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా ఇసుక క్వారీలకు నిర్వహిస్తున్న రివర్స్‌ ఆక్షన్‌ టెండర్లు అనుమానాలకు తావిస్తున్నాయి. అమరావతి మండలంలోని దిడుగు, ధరణికోట క్వారీల్లో ఇసుక తవ్వకం, లారీల్లోకి లోడింగ్‌, రవాణా, స్టాక్‌ పాయింట్‌ వద్ద అన్‌లోడింగ్‌కు నిర్వహించిన ఈ-ఆక్షన్‌ టెండర్లు ఇందుకు ఊతమిచ్చేవిలా ఉన్నాయి. ఇసుక క్వారీ దక్కించుకొంటే ఆ తర్వాత అక్రమాలు చేసి భారీగా వెనకేసుకోవచ్చన్న ఆత్రుత కాంట్రాక్టర్లలో కొట్టొచ్చినట్లు కనపడుతోంది. టన్నుకు కేవలం రూ.15కే ఇసుక తవ్వకం, రవాణా, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేస్తామని కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. అయితే ఇది ఏ కోణంలో నుంచి చూసినా వర్కుఅవుట్‌ కాదని అనుభవమున్నవారు చెబుతున్నారు. టన్నుకు తక్కువలో తక్కువ రూ.115 ఉంటే పెద్దగా లాభం లేకుండా కాంట్రాక్టు చేయొచ్చని పేర్కొంటున్నారు. అలాంటిది కొంతమంది రూ.15కే టెండర్లు దాఖలు చేయడంపై అనుమానాలు వస్తున్నాయి. రివర్స్‌ ఆక్షన్‌ నిబంధనల ప్రకారం ఎవరు తక్కువ మొత్తానికి పనిని చేయడానికి ముందుకొస్తారో వారికే దానిని కేటాయించాల్సి ఉండటంతో ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వర్గం
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు
ఏటీఎంల వింత ప్రవర్తన ..అయోమయంలో వినియోగదారులు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.