(Local) Wed, 02 Dec, 2020

శబరిమలలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు ...

November 19, 2019,   7:54 PM IST
Share on:
శబరిమలలో 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు ...

కేరళలోని ప్రముఖ శబరిమల యాత్రకు వచ్చిన ఒక 12 ఏళ్ల బాలికను ఆలయ ప్రవేశానికి పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆ బాలిక తన తండ్రిని, ఇతర బంధువులను గుడిలోకి పంపి తాను మాత్రం ఒంటరిగా బయట ఉండిపోవలసి వచ్చింది. ఇరుముడి వేసుకుని దీక్షా వస్త్రాలతో తన తండ్రి వెంట శబరిమల యాత్రకు వచ్చిన ఒక 12 ఏళ్ల బాలిక క్యూ బుకింగ్ వద్ద తన వయసు 10 ఏళ్లుగా నమోదు చేసుకుంది. అయితే పంబ వద్ద ఆమె గుర్తింపు పత్రాన్ని పరిశీలించిన పోలీసులు ఆ బాలిక వయసు 12 ఏళ్లుగా గుర్తించారు. దీంతో ఆ బాలికను గుడి వద్దకు అనుమతించలేదు.

తమిళనాడు నుంచి వచ్చిన భక్త బృందంలో ఆ బాలిక ఉంది. ఇలా ఉండగా కర్నాటక నుంచి వచ్చిన ఒక 9 సంవత్సరాల కేరళ బాలిక మెడలో ధరించిన ప్లకార్డు అందరినీ ఆకట్టుకుంది. వేచి ఉండడానికి సిద్ధం.. నాకు 50 ఏళ్లు వచ్చాకే అయ్యప్పను దర్శించుకుంటా..అంటూ అందులో రాసి ఉంది. శబరిమల ఆలయ సంప్రదాయాల ప్రకారం 1050 ఏళ్ల మధ్యవయసులో ఉన్న మహిళలు అయప్ప ఆలయాన్ని సందర్శించడం నిషిద్ధం. కాగా, ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు గత ఏడాది రద్దు చేసింది. గత ఏడాది మండల విళక్కు కాలంలో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళలకు భక్తుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ ఆలయ ప్రవేశానికి వచ్చే మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించబోమంటూ రాష్ట్ర ఆలయ వ్యవహారాల మంత్రి సురేంద్రన్ స్వయంగా ప్రకటించారు. దీంతో పోలీసులు పంబ వద్దనే 1050 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళలను వారి గుర్తింపు కార్డుల ఆధారంగా నిలిపివేస్తున్నారు.

సంబంధిత వర్గం
శబరిమలకు బిందు..కారం చల్లిన భక్తులు
శబరిమలకు బిందు..కారం చల్లిన భక్తులు
సీఎం వైఎస్ జగన్ కు కేరళ సీఎం ఆహ్వానం
సీఎం వైఎస్ జగన్ కు కేరళ సీఎం ఆహ్వానం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.