(Local) Fri, 05 Jun, 2020

ఆర్టీసి సమ్మె.. సర్కార్ కు అందిన హైకోర్టు కాపీ

October 20, 2019,   4:47 PM IST
Share on:
ఆర్టీసి సమ్మె.. సర్కార్ కు అందిన హైకోర్టు కాపీ

తెలంగాణ ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పై వెంటనే చర్చించి సమస్య పరిష్కరించాలని హైకోర్టు సర్కార్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తమకు కోర్టు కాపీ అందితేనే చర్చలు చేపడుతామన్నట్టు సర్కార్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం హైకోర్టు ఆర్డర్ కాపీ సర్కార్ కు అందింది. ఈ ఆర్డర్ కాపీని తీసుకొని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసి ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ హూటాహుటిన ప్రగతి భవన్ కు చేరుకొని సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఆర్టీసి కార్మికులతో చర్చలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఆర్టీసి కార్మికులు ఈ నెల 30వ తేది వరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడంతో సర్కార్ కాస్త అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.