(Local) Fri, 15 Nov, 2019

భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసి జేఏసీ

October 20, 2019,   5:10 PM IST
Share on:
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసి జేఏసీ

తెలంగాణ ఆర్టీసి జేఏసీ నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ పార్టీల నాయకులతో కలిసి ఆర్టీసి జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. పోరాటాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదని సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కనికరించి కార్మిక సంఘాలతో చర్చలు జరపాలన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులంతా సంయమనంతో పోరాటం చేయాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.ఓయూ విద్యార్దులు, అన్ని విద్యార్ధి సంఘాల నాయకులు తమకు సహకరించాలని, సమ్మె పై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. 21 నుంచి 27 వరకు తమ భవిష్యత్ కార్యాచరణను ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. 27 వరకు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఆ తర్వాత మరోసారి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. శనివారం బంద్ ను విజయవంతం చేసిన యావత్ ప్రజానికానికి జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. తలలు తెగిపడ్డా సరే ఉద్యమాన్ని ఆపమని ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మరోసారి అన్నారు.

21 న ఆర్టీసి కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి అన్ని డిపోల ముందు బైఠాయింపు

22న తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు విజ్ఞప్తి. తమ పొట్ట కొట్టొద్దని సమ్మెకు సహకరించాలని శాంతియుతంగా విజ్ఞప్తి

23న ప్రజాప్రతినిధులతో ములాఖత్

24 న మహిళా కండక్టర్ల దీక్షలు

25న రహాదారుల దిగ్భందనం

26న ఆర్టీసి కార్మికుల పిల్లలతో కలిసి డిపోల ముందు ధర్నాలు

27న ఆర్టీసి కార్మికులు దీపావళి పండుగ చేసుకునే స్థితిలో లేరు కాబట్టి పండగ జరుపుకోవద్దని నిర్ణయం.

30న "సకల జనుల సమరభేరి" పేరుతో భారీ బహిరంగ సభ. త్వరలో వేదిక ఖరారు.

You have an error in your SQL syntax; check the manual that corresponds to your MySQL server version for the right syntax to use near ')," and p.slug!="rtc-jac-announces-future-activity" GROUP BY p.p_id order by p.p' at line 6
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.