(Local) Fri, 26 Feb, 2021

ఆర్టీసి కార్మికుల సమ్మె రికార్డు

November 16, 2019,   12:58 PM IST
Share on:
ఆర్టీసి కార్మికుల సమ్మె రికార్డు

తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె రికార్డుకు చేరుకుంది. నేటితో ఆర్టీసి కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మెను నిర్వహించారు. 13 సెప్టెంబర్ 2011 నుంచి సమ్మె కొనసాగి 42 రోజుల పాటు సాగింది. ఆనాడు ఆర్టీసి, సింగరేణి కార్మికులతో పాటు టీఎన్జీవోలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇప్పుడు ఆర్టీసి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నారు. అక్టోబర్ 5, 2019 నుంచి ఆర్టీసి కార్మికుల సమ్మె ప్రారంభమైంది. ఈ సమ్మె నేటితో 43 రోజులకు చేరుకుంది. ఆర్టీసి సమ్మె పై విచారణను హైకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసి కార్మికుల సమ్మె రికార్డులోకెక్కనుంది. రేపటితో సకలజనుల సమ్మెను కూడా ఆర్టీసి సమ్మె బ్రేక్ చేస్తుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.