(Local) Sun, 25 Oct, 2020

యంగ్ లుక్ తో షాకిస్తున్న మాస్ మ‌హారాజా…!!

August 24, 2019,   12:00 PM IST
Share on:
యంగ్ లుక్ తో షాకిస్తున్న మాస్ మ‌హారాజా…!!

మాస్ మ‌హారాజా అనగానే +టక్కున గుర్తుకి వచ్చే పేరు హీరో రవితేజ. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తర్వాత రవితేజ వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో “డిస్కో రాజా” అనే చిత్రంలో నటిస్తున్నాడు.  ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ డైరెక్షన్ కాగా,  ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. నభా నటేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. త్వ‌ర‌లో పూర్తి లుక్ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అన్నారు. అయితే చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, తాజాగా ఆయన యంగ్ లుక్ ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయిదు పదులు వయస్సులో కూడా ఇంత యంగ్ గా కనిపించడంతో ర‌వితేజని చూసిన  ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఇది రియల్ పిక్ లేక పేస్ యాప్ ద్వారా మరీనా ఫోటోనా అనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.