(Local) Tue, 02 Mar, 2021

బ్రూస్‌లీ జయంతి సందర్భంగా `ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న్‌` టీజ‌ర్‌...

November 28, 2019,   3:48 PM IST
Share on:
బ్రూస్‌లీ జయంతి సందర్భంగా `ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న ...

టాలీవుడ్ లో ఒకప్పుడు ఫేమస్ డైరెక్టర్ ఇప్పుడు వివాదాల దర్శకుడిగా పిలవబడే వర్మ....'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ ఓ మూవీ తెరకెక్కిస్తూ అటు కాంట్రవర్సీ తో పాటు మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుండో పెండింగులో ఉన్న ‘లేడీ బ్రూస్ లీ’ సినిమా పేరు మార్చి బయటకి తీశారు. ఆర్జీవీ తాజా చిత్రం ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ టీజర్‌ విడుదలైంది. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను వర్మ విడుదల చేశారు. 

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో నటించారు. వర్మ మార్క్ రొమాంటిక్, యాక్షన్ అంతా కనిపిస్తోంది టీజర్‌లో.. పూజా భలేకర్‌ ఎన్నాళ్లు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుందో కానీ రఫ్పాడించేసింది.. ఫైట్స్‌తో పాటు, రొమాంటిక్ సీన్స్‌లోనూ రెచ్చిపోయింది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్టుగానే కనిపిస్తోంది.  బ్రూస్‌లీ  పై అభిమానంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి ఒకరితో ప్రేమలో పడుతుంది. మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం లేని అబ్బాయి అది వదిలెయ్ మంటాడు. బ్రూస్ లీ కి, ప్రేమికుడికి, ఆ అమ్మాయికి మధ్య నడిచే ట్రై యాంగిల్ లవ్ స్టోరీనే ఈ చిత్రం అని తెలుస్తుంది.ఈ చిత్రానికి రవిశంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డిసెంబర్ 13న ఈ సినిమా ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత నగరం చైనాలోని ఫోషన్ సిటీలో రిలీజ్ చేయనున్నట్లు వర్మ తెలిపాడు.

సంబంధిత వర్గం
వర్మకు హైకోర్టు షాక్....
వర్మకు హైకోర్టు షాక్....
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ
'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'....వర్మ

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.