(Local) Sun, 20 Oct, 2019

బెంగళూరు హాస్పిటల్ లో సూపర్ స్టార్.....

August 29, 2019,   5:34 PM IST
Share on:
బెంగళూరు హాస్పిటల్ లో సూపర్ స్టార్.....

సూపర్ స్టార్ రజినీకాంత్ సడన్ గా బెంగుళూరులోని ఒక హాస్పిటల్ ముందు ప్రత్యక్షం కావడంతో చుట్టూ ప్రక్కల ఉన్న వారందరు ఒక్కసారిగా షాకయ్యారు. రజినీకాంత్ హాస్పటల్ కి వచ్చారని తెలియగానే ఒక్కసారిగా ఆ ప్రయివేట్ హాస్పిటల్ కి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ముందు ఆయన ట్రీట్మెంట్ కోసం వచ్చారని టాక్ వచ్చినప్పటికీ అనంతరం ఆయన సోదరుడిని పరామర్శించడానికి వచ్చినట్లు తెలిసింది. రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ గత కొంత కాలంగా మోకాలి నొప్పులతో బాధపడుతున్నారు. అయితే రీసెంట్ గా సర్జరీ ట్రీట్మెంట్ కోసం బెంగుళూరులోని శేషాద్రిపురంలోని అపోలో ఆస్పత్రిలో సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సజరిగింది.   తన అన్నయ్యను పరామర్శించడానికి రజిని దర్బార్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి బెంగుళూరుకి వెళ్లాల్సి వచ్చింది. తన సోదరుడి ఆరోగ్యంపై డాక్టర్లతో కొంత సేపు మాట్లాడిన తలైవా అనంతరం అభిమానులకు అభివాదం తెలుపుతూ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిపోయారు.

సంబంధిత వర్గం
రజినీతో నటించాలనుంది: కాజల్
రజినీతో నటించాలనుంది: కాజల్
చరిత్ర పుటల్లో కనుమరుగయినా వీరుడి కథ.....సైరా టీజర ...
చరిత్ర పుటల్లో కనుమరుగయినా వీరుడి కథ.....సైరా టీజర ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.