(Local) Wed, 24 Jul, 2019

రఘుకుంచె ‘పలాస 1978’

July 05, 2019,   12:00 AM IST
Share on:

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై "లండన్ బాబులు"  ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం  ‘‘పలాస 1978’’. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’ చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తాజాగా మరో విషయంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

యాంకర్ గా,సింగర్ గా,మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రఘు కుంచె తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు.. ఫస్ట్ లుక్ తోనే క్యూరీయాసిటీ క్రియేట్ చేసిన ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నారు.అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో పర్ఫార్మెన్స్ కు బాగా స్కోప్ ఉన్న చాలెంజింగ్ పాత్ర చేయబోతున్నారు..‘‘పలాస 1978’’ కు రఘు కుంచె మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుండటం మరో విశేషం. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ కు,రఘు విలన్ పాత్ర కు సూటవుతారని ఫిక్స్ చేశారు..ఈ క్యారెక్టర్ లో నాలుగు డిఫరెంట్ ఏజ్ లు చూపించే పాత్రను రఘు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.