(Local) Sun, 27 Sep, 2020

దర్శకేంద్రుడు మెచ్చిన 'ఎవరు'....

August 17, 2019,   1:33 PM IST
Share on:
దర్శకేంద్రుడు మెచ్చిన 'ఎవరు'....

కొత్త సినిమాల కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే ఒక సస్పెన్స్ తో కూడిన థ్రిల్లర్ మూవీ వచ్చి అందులో ఎవరు ఊహించని విధంగా సినిమా కనుక తెరకెక్కిస్తే ఇక ఆ సినిమాకి సామాన్య ప్రేక్షకుడితో పాటు సెలెబ్రిటీస్ వరకు అభినందలు వర్షం కురుస్తుంది. తాజాగా అడివి శేష్ హీరోగా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఎవరు సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15 రిలీజైన ఈ సినిమాకు కామన్ ఆడియెన్స్ నుంచి సినీ పరిశ్రమ ప్రముఖుల వరకు అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా చుసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నుంచి కూడా ఎవరు చిత్ర యూనిట్ పాజిటివ్ కామెంట్స్ ను అందుకుంది.

మంచి చిత్రాలపై మనస్ఫూర్తిగా స్పందించే దర్శకేంద్రుడు చిత్ర యూనిట్ పడిన కష్టానికి తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా అభినందనలు చెప్పారు. ముఖ్యంగా సినిమాలో ట్విస్ట్ కి తన మైండ్ బ్లో అయ్యిందని అన్నారు. సినిమాలో ప్రతి బిట్ ని ఎంజాయ్ చేశాను అంటూ.. దర్శకుడు వెంకట్ రాంజీ అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను హ్యాండిల్ చేసినట్లు చెప్పారు. అలాగే కథానాయకుడు అడివి శేష్ కథానాయిక రెజీనా అద్భుతంగా నటించారని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ పివిపి కి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఘవేంద్రరావు ట్వీట్ కి ఆడివిశేష్ బాదులిస్తూ.. చాలా కృతజ్ఞతలు సర్ అని రీట్వీట్ చేశాడు.

సంబంధిత వర్గం
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
ట్విస్టులే ట్విస్టులు....ప్లీజ్ లీక్ చేయోద్దు
ట్విస్టులే ట్విస్టులు....ప్లీజ్ లీక్ చేయోద్దు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.