(Local) Sun, 16 Feb, 2020

మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్‌ విసిరిన పివి సింధు

November 02, 2019,   3:22 PM IST
Share on:
మరో ముగ్గురు ప్రముఖులకు ఛాలెంజ్‌ విసిరిన పివి సింధ ...

ప్రముఖ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పివి సింధు గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె గోపిచంద్‌ అకాడమీలో మూడు మొక్కలు నాటారు. కాగా ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం ఎంతో గొప్పదని కొనియాడారు. రాను రాను పర్యావరణం క్షీణిస్తుందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె గుర్తు చేశారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంశలతో ముంచెత్తారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో విధిగా భాగస్వాములు అవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. మరో ముగ్గురు ప్రముఖులకు కూడా ఆమె ఛాలెంజ్‌ విసిరారు. వారిలో టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా, బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్‌, టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీలకు తాను సవాలు విసిరింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.