(Local) Tue, 29 Sep, 2020

పులిహోర రాజాకు పునర్నవి షాక్

August 16, 2019,   9:55 PM IST
Share on:
పులిహోర రాజాకు పునర్నవి షాక్

బిగ్ బాస్ పులిహోర రాజా రాహుల్ సిప్లిగంజ్‌కి పెద్ద షాకే ఇస్తోంది గ్లామర్ బ్యూటీ పునర్నవి భూపాలం. రక్షా బంధన్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో రాఖీ పండుగ సంబరాలను ఏర్పాటు చేశారు. ఇందులో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అన్నా చెల్లెల్లుగా మారారు. రవికి రోహిణి రాఖీ కట్టగా.. అలీకి శివజ్యోతి, మహేష్‌కి అషు రాఖీ కట్టి భావోద్వేగానికి గురౌతున్నారు. అయితే పునర్నవి ఎవరికి రాఖీ కడుతుందనగా.. ‘అతనిలో మా తమ్ముడ్ని చూస్తున్నా అంటూ పునర్నవి రాహుల్ వైపు చూడటంతో.. రాహుల్ ఉలిక్కి పడుతున్నాడు. కెమెరాలు మొత్తం రాహుల్‌పైనే ఫోకస్ కావడంతో సీన్ సితార్ అయిపోయింది’ అంటూ హిమజ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం హౌస్ మొత్తం నవ్వులు కురియడాన్ని ప్రోమోగా కట్ చేసి వదిలింది స్టార్ మా. అయితే పునర్నవి.. నిజంగానే రాహుల్‌కి రాఖీ కట్టిందా? ఆమె తమ్ముడూ అంటున్నది రాహుల్‌నేనా అన్నది నేటి ఎపిసోడ్‌లో తేలిపోనుంది. పులిహోర రాజా రాహుల్ ఈవారం ఎలిమినేట్ అవకాశం లేదు. అతన్ని తీయరు.. పులిహోర రాజా అనే ట్యాగ్ అతన్ని హౌస్‌లో ఉండేలా చేస్తుంది. అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ తక్కువ అంటూ ఎలిమినేషన్‌పై రవి, హిమజలతో చర్చించింది శ్రీముఖి.

సంబంధిత వర్గం
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
సర్వర్‌గా మరీనా వరుణ్ సందేశ్‌....ఇంటి స‌భ్యుల‌పై బ ...
సర్వర్‌గా మరీనా వరుణ్ సందేశ్‌....ఇంటి స‌భ్యుల‌పై బ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.