(Local) Wed, 24 Jul, 2019

సాహో 'సైకో సయాన్' సాంగ్ టీజర్ విడుదల

July 05, 2019,   11:59 AM IST
Share on:

సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కొత్త సినిమా సాహో. ఈ చిత్రం మొత్తంగా నాలుగు ప్రధాన భాషల్లో తెలుగుతో, హిందీ, తమిల్, మలయాళంలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ తొలిసారిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. అయితే డార్లింగ్ నిన్న తన ఇంస్టాగ్రామ్ లో సాహో సాంగ్ టీజర్ తర్వలో రిలీజ్ చేస్తాం అని చెప్పగా అభిమానులు ఎదురుచూపులు ఎక్కువయినాయి. అన్నట్టుగానే “సాహో” సైకో సైయాన్ సాంగ్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేయడం జరిగింది... 

 సైకో సైయాన్ సాంగ్ టీజర్ ఓ పబ్ వాతావరణంలో బ్యూటీ శ్రద్దా కపూర్ అల్ట్రా స్టైలిష్ లుక్ కాస్ట్యూమ్స్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్స్ వేయగా, ట్రెండీ స్టయిల్లో వెస్ట్రన్ బీట్ తో సాగె ఈ సాంగ్ టీజర్ అదరగొట్టారు. ప్రస్తుతం 30సెకెన్ల నిడివిగల ఈ టీజర్ సాంగ్ యూట్యూబ్ లో అద్భుతమైన వ్యూస్ తో దూసుకుపోతోంది. పూర్తి పాటను ఈ నెల 8న విడుదల చేస్తున్నట్లు ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కాగా ఈ సినిమాని ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు…!!
 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.