(Local) Fri, 22 Oct, 2021

యు/ఏ సర్టిఫికెట్ పొందిన ‘సాహో’…..!!

August 23, 2019,   8:58 PM IST
Share on:
యు/ఏ సర్టిఫికెట్ పొందిన ‘సాహో’…..!!

రన్ రాజా రన్ మూవీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రముఖ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ జంటగా నటించిన సినిమా ‘సాహో’. హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ సెలబ్రిటీస్ సహా పలు బడా స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. ప్రభాస్ కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. వచ్చే శుక్రవారం ఆగష్టు 30న ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషలలో ప్రపంచ వ్యాప్తంగా  విడుదలకానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చిందని సినిమా యూనిట్ తెలిపింది. ఈ సినిమా నిడివి 2గంటల 51 నిమిషాల 52 సెకన్లుగా ఉంది. హాలీవుడ్ తరహా యాక్షన్ స్వీక్వెన్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. దీంతో ‘సాహో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 

సంబంధిత వర్గం
సెన్సార్ పూర్తి చేసుకున్న....జార్జిరెడ్డి
సెన్సార్ పూర్తి చేసుకున్న....జార్జిరెడ్డి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.