(Local) Mon, 27 Sep, 2021

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు - రేవంత్ రెడ్డి

September 17, 2019,   10:13 AM IST
Share on:
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు - రేవంత్ రెడ్డి

యురేనియం తవ్వకాల విషయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ అనుమతి లేకుండా ఫారెస్ట్‌లో తవ్వకాలు జరగకూడదన్నారు. నల్లమలలో తవ్వకాల కోసం 2016లో తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కలిసి కాంగ్రెస్‌పై నెపం నెడుతున్నారని దుయ్యబట్టారు. తుమ్మలపల్లిలో చెంచులు లేరు, ఫారెస్ట్ లేదని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి వెళ్లే నీళ్లు కలుషితం అవుతాయన్నారు. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్.. నల్లమలతో పాటు కడప జిల్లాలోనూ పర్యటించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అక్కడికి తవ్వకాల కోసం వెళ్లే వారిని ఆపాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన  కేటీఆర ...
 బాన్సువాడలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.