(Local) Wed, 23 Sep, 2020

భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్న పాక్ క్రికెటర్

August 22, 2019,   3:29 PM IST
Share on:
భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్న పాక్ క్రికెటర్

పాకిస్థాన్ యువ ఫేస్ బౌలర్ అసన్ అలీ,  దుబాయిలో నివసిస్తున్న ఇండియాకు చెందిన అమ్మాయి షామియ అర్జూ(25)ను పెళ్లీ చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.  దుబాయ్‌లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో మంగళవారం రాత్రి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లీ జరిగింది.  బ్లాక్ షేర్వానీలో హ‌స‌న్‌, రెడ్ & గోల్డ్ డ్రెస్‌లో ఆర్జూలు మెరిసిపోయారు. ప్రస్తుతం వీరి పెళ్లీకి సంబంధించిన ఫోటోలు, విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గతంలో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే జహీర్ అబ్బాస్, మోసిన్ ఖాన్ వంటి పాకిస్తాన్ క్రికెటర్లు కూడా భారత మహిళలనే పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత వర్గం
వరుస విజయాల కోహ్లి సేన...
వరుస విజయాల కోహ్లి సేన...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.