(Local) Wed, 21 Aug, 2019

తెలంగాణలో త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

August 13, 2019,   11:02 AM IST
Share on:

త్వరలోనే నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే నామినేటేడ్ పోస్టుల భర్తీ అంశం తెర మీదకు రాగానే పార్టీలోని సీనియర్ నేతలకు కాస్త భయం పట్టుకున్నట్టు సమాచారం. పార్టీలో చాలా కాలం ఉన్న తమను కాదని ఇటీవల పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యమిస్తారేమోనని వారు ఆందోళన చెందుతున్నారట. ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయాన నూతనంగా చేరిన వారికి టిక్కెట్లు కేటాయించారు. నామినేటేడ్ పోస్టులను కేటాయిస్తామని పార్టీ సీనియర్లను కేసీఆర్ బుజ్జగించారు.

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో వెంకటేష్ చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఆయన టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో చేరిన వెంటనే ఆయనకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టును కేటాయించారు. గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన భార్య గండ్ర జ్యోతికి వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఇలా పలు ప్రాంతాల్లో సీనియర్లను కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాముఖ్యతనిచ్చారు. ఈ సారి నామినేటేడ్ పోస్టుల భర్తీలోనైనా తమకు న్యాయం జరుగుతుందా లేదా అని అంతా ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ దీని పై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత వర్గం

పోర్న్ సైట్లు కట్టడి చెయ్యాలని గూగుల్ కు హై కోర్ట్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.