(Local) Mon, 27 Sep, 2021

ఆర్టీసి నిర్వహణను భరించలేమని స్పష్టం చేసిన కేంద్రం

November 27, 2019,   3:34 PM IST
Share on:
ఆర్టీసి నిర్వహణను భరించలేమని స్పష్టం చేసిన కేంద్రం

ఆర్టీసి నిర్వహణకు ప్రభుత్వంపై నెలకు రూ. 640 కోట్లకు పైగా భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో ఆర్టీసి సమ్మె నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కూడా ఆర్టీసి నష్టాలను భరించలేమని తేల్చి చెప్పింది. తెలంగాణ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమైన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ఆర్టీసిపై కేంద్ర వైఖరిని స్పష్టం చేశారు. ఆర్టీసి నష్టాలను భరించాలని కెసిఆర్‌ కూడా కోరినట్లు, అయితే అది కేంద్రం వల్ల కాదని తెలిపామని ఆయన చెప్పారు. కానీ ఆర్టీసి అధికారులను ఢిల్లీకి పిలిపించి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మాత్రం ఎంపీలకు స్పష్టం చేశారు. కాగా ఎంపీలు ప్రధాని మోడి అపాయింట్‌మెంట్‌ కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆర్టీసిలో 5100 ప్రవేట్‌ బస్సుల రూట్‌ పర్మిట్లకు హైకోర్టు ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా ఆర్టీసి యాజమాన్యం సిబ్బంది సంఖ్యను తగ్గించే యోచనలో పడింది. 50 ఏళ్లు పైబడిన కార్మికులకు విఆర్‌ఎస్‌ ఆఫర్‌ చేసేందుకు సముఖంగా ఉన్నట్లు తెలస్తోంది. మంత్రివర్గ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.