(Local) Wed, 02 Dec, 2020

వ‌ర‌ద బాధితుల‌కి ఇళ్ళు క‌ట్టిస్తున్న బాలీవుడ్ న‌టుడు

August 17, 2019,   3:53 PM IST
Share on:
వ‌ర‌ద బాధితుల‌కి ఇళ్ళు క‌ట్టిస్తున్న బాలీవుడ్ న‌టు ...

సొసైటీ లో ఏ విపత్కరమైన ప్రమాదాలు సంభవించినప్పుడు కేవలం ప్రభుత్వమే కాదు సామాన్యుల నుండి సెలెబ్రటీస్ వరకు స్పందిస్తూ తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. తాజాగా కొల్హాపూర్‌లోని షిరోల్ ప‌రిస‌ర ప్రాంతాల‌లోని ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల వ‌ల‌న తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రైతే వ‌ర‌ద‌లలో త‌మ ఇళ్ళు కొట్టుకుపోవ‌డంతో నిరాశ్ర‌యుల‌య్యారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన ప్ర‌ముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్‌పై వ‌ర‌ద బాధితుల‌కి 500 ఇళ్ళు క‌ట్టించేందుకు సిద్ధం అయ్యారు. నేను షిరోల్‌కు వచ్చినప్పుడు, అక్క‌డి పరిస్థితిని చూశాను, అందుకే మేము 500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాము. తక్లేవాడిలోని 3 వేల ఇళ్ల పరిస్థితిని సమీక్షించబోతున్నాం. ప్రభుత్వానికి కూడా దాని పరిమితులు ఉన్నాయి. అందువల్ల, మనమందరం వరద ప్రభావిత పౌరులకు పునరావాసం కల్పించడానికి ప్రయత్నించాలి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వర్గం
“హాట్ నెస్ కి చిరునామా
“హాట్ నెస్ కి చిరునామా" ఈ భామ....
వరద పరిస్థితిని ఏరియల్‌ వ్యూ ద్వార పరిశీలించిన గవర ...
వరద పరిస్థితిని ఏరియల్‌ వ్యూ ద్వార పరిశీలించిన గవర ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.