(Local) Sun, 20 Oct, 2019

ఇంటి పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోండి...నాగార్జున

September 16, 2019,   2:39 PM IST
Share on:
ఇంటి పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోండి...నాగార్ ...

ఈ మధ్య ఎక్కడ చుసిన తెలుగు రాష్ట్రాలలో దోమల సంఖ్య విపరీతమవ్వగా  కొన్ని చోట్ల డెంగ్యూ జ్వరాలు విజృంభించిన సంగతి  తెలిసిందే. తాజాగా ఈ వైరల్ ఫీవర్ బారిన పడిన వారిలో అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. తాజాగా వైరల్  ఫీవర్ నుంచి కోలుకుంటున్న నాగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసారు. అందులో " ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకుంటున్న..కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయంటున్నారు టాలీవుడ్ హీరో.. తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇంటి పరిసరాలు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో మురికి నీటిని శుభ్రం చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్టు చేశారు. మురికి నీటి వల్ల దోమలు వృద్ధి చెందుతాయని, దీనివల్ల అనారోగ్య బారిన పడుతామన్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించి నాగ్..అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎలాంటి అపరిశుభ్రత వాతావరణం ఉండకూడదని సిబ్బందికి చెప్పడం జరిగిందన్నారు. మీ ఇల్లు, పని చేస్తున్న ప్రదేశాల్లో మురికి నీటిని తొలగించాలంటూ మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేశారు. తన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. కొన్ని ఫోటోల్ని కూడా షేర్ చేశారు నాగార్జున.

సంబంధిత వర్గం
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.