(Local) Fri, 30 Oct, 2020

తెలంగాణ పురపాలక ఎన్నికల పిటిషన్‌ ఈనెల 13కు వాయిదా

August 06, 2019,   1:17 PM IST
Share on:
తెలంగాణ పురపాలక ఎన్నికల  పిటిషన్‌ ఈనెల 13కు వాయిదా

తెలంగాణ పురపాలక ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఈనెల 13కు వాయిదా వేసింది. దీనిపై ఈ నెల 9న కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురపాలక వార్డుల విభజన, రిజర్వేషన్లు నిబంధనల ప్రకారమే జరిగాయా అనే విషయాలను కోర్టుకు తెలియజేయాలని కోరింది.మరోవైపు పురపాలక సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనిపై సిఎం కెసిఆర్‌ సోమవారం అధికారులతో చర్చించినట్లు తెలిసింది. పురపాలక ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని భావిస్తున్న సీఎం ఇందుకోసం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసినట్లు సమాచారం. కేసుల పరిధిలో లేని పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరపాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం ప్రభుత్వం హైకోర్టులోనూ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.

సంబంధిత వర్గం
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
నూతన ప్రధానిగా గొటాబయ ప్రమాణం స్వీకారం
ఆమ్ ఆద్మీ పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత
ఆమ్ ఆద్మీ పార్టీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.