(Local) Mon, 27 Sep, 2021

చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్

November 05, 2019,   10:48 AM IST
Share on:
చంద్రబాబుపై మోహన్ బాబు ఫైర్

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై సినీనటుడు, వైసీపీ నేత మోహన్ బాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు.. ఎన్నికలు అయ్యిపోయాయి. ఎవరిదారిన వాళ్లు ఉన్నారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదన్నారు. రెండ్రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుంచి రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు,  సినీ పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. దయచేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించొద్దని ఈ మేరకు ట్విట్టర్ లో మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.