(Local) Mon, 09 Dec, 2019

అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....

November 20, 2019,   5:42 PM IST
Share on:
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....

కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహ రెడ్డి'. రేనాటి సూర్యుడిగా పిలవబడే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి పోషించగా...లేడి సూపర్ స్టార్ నయనతార జోడి కట్టారు.. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ప్రపంచ వ్యాప్తంగా అయిదు భాషల్లో విడుదలై భారీ విజయాన్ని చవి చూసింది. ఈ చిత్రంలో అమితాబ్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, ప్రముఖ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా సైరా సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ శుభవార్త అందించింది.

సైరా నరసింహారెడ్డి సినిమా నవంబర్ 21 నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రేపే అమెజాన్‌ విడుదలవుతుండగా హిందీ వర్షన్‌ మాత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం సినిమాలకు డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలపై కూడా భారీ క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, ఇంట్లోనే డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలపై వీక్షిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సినిమా రిలీజ్‌ అయిన 40, 50 రోజుల్లోనే అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ సినిమాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈరోజు నెట్‌ఫ్లిక్స్‌‌లో మల్లేశం, దొరసాని సినిమాలు విడుదలైనవి

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.