(Local) Mon, 09 Dec, 2019

‘మర్దానీ 2’ ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న రాణీ ముఖర్జీ

November 14, 2019,   7:02 PM IST
Share on:
‘మర్దానీ 2’ ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న రాణీ ముఖర్జీ

యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో గోపీ పుత్రన్ దర్శకత్వంలో రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మర్దానీ 2’. వాస్తవ సంఘటనల ఆధారంగా  2014లో తెరకెక్కిన ‘మర్దానీ’ చిత్రానికి సీక్వెల్‌ ఈ  ‘మర్దానీ 2’ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ ‘మర్దానీ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో ‘మర్దానీ’ రూపొందగా, కిడ్నాపింగ్, రేప్ వంటి ఘటనలతో ‘మర్దానీ 2’ తెరకెక్కుతోంది. ఇండియాలో ప్రతీ ఏటా 18 సంవత్సరాలలోపు కుర్రాళ్ల కారణంగా 2 వేల రేప్ కేసులు నమోదవుతున్నాయని చెబుతూ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.  ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడమే కాక సినిమాపై అంచనాలు పెంచింది. రాణీ ముఖర్జీ శివానీ శివాజీ రాయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపిస్తుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.. డిసెంబర్ 13న ఈ ‘మర్దానీ 2’ విడుదల కానుంది..

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.