(Local) Wed, 21 Aug, 2019

 జోరు మీద లేని మన్మథుడు......

August 12, 2019,   1:53 PM IST
Share on:

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించి, పి.కిరణ్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ ప్రీత్ సింగ్  హీరోయిన్‌ గా నటించింది.  ఆఫీసర్ సినిమా డిజాస్టర్ తర్వాత నాగార్జున ఎన్నో ఆశలతో చేసిన మల్టీ స్టారర్ దేవదాస్ కూడా నిరాశ పరిచింది. అయితే మన్మథుడు-2 మూవీ సైతం ఆయనకు ఆశించిన ఫలితాన్నిచ్చేలా కనిపించడం లేదు. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి సంబంధం లేకుండానే అద్బుతమైన వసూళ్లు సాధించింది, అయితే రెండో రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బానే ప్రదర్శన ఉంటుందని  జోరు కొనసాగుతుంది అనిపించింది కానీ అఫీషియల్ కలెక్షన్స్ మాత్రం నిరాశ మిగిల్చాయి. రెండో రోజు తక్కువలో తక్కువ 2 కోట్ల నుండి 2.2 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందని అనుకున్నా 1.85 కోట్ల షేర్ వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. అలా రెండు తెలుగు రాష్ట్రాల రెండ్రోజుల వసూళ్ళని గమనిస్తే 5.55 కోట్ల షేర్ సాధించింది. ఇక ఈ సినిమా మూడో రోజు కలెక్షన్స్ గమనిస్తే 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకోవచ్చని అంటున్నారు. మొత్తం మీద వీకెండ్ కష్టంగానే ముగించిన ఈ సినిమా ఈరోజు నుండి కలెక్షన్స్ ఎలా ఉంటాయో మరి. మొత్తం మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే పది కోట్ల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన వస్తే కానీ లెక్కలు తెలియవు.

సంబంధిత వర్గం

బ్లూ బికినిలో అభిమానులు ఫిదా చేస్తున్న.....రకుల్
సర్వర్‌గా మరీనా వరుణ్ సందేశ్‌....ఇంటి స‌భ్యుల‌పై బ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.