(Local) Wed, 21 Aug, 2019

సూపర్ స్టార్ కూతురి క్యూట్ డ్యాన్స్… వీడియో వైరల్

August 13, 2019,   1:48 PM IST
Share on:

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ మాత్రమే ట్రెండ్ అవ్వడం కాదు వారి కుటుంబ సభ్యలు కూడా అప్పుడప్పుడు  ట్రెండ్ అవ్వడం చూస్తూనే ఉంటాం. సూపర్ స్టార్ మహేష్ తనయురాలు సితారకి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే అతిశోయక్తి కాదు..అయితే మ‌హేష్ లేదా న‌మ్ర‌త  అప్పుడ‌ప్పుడు సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఆ మ‌ధ్య సొంతంగా తన ఫ్రెండ్తో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సితార దానికి వారిద్దరి పేర్లు వచ్చేలాగా Aadya అండ్ Sitara పేర్లలో  A&S అని ఛానల్ నేమ్ పెట్టడమే కాకుండా అందులో మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే అప్పుడ‌ప్పుడు క్యూట్ డ్యాన్స్‌తోను సంద‌డి చేసే సితార తాజాగా మ‌హ‌ర్షి చిత్రంలోని పాల‌పిట్ట‌... అనే సాంగ్‌కి క్యూట్ స్టెప్స్ వేసింది. ఈ డ్యాన్స్‌కి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు . 

సంబంధిత వర్గం

మహర్షి మూవీ నుండి తొలగించిన సన్నివేశం.....
13 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకున్న....హీరోయిన్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.