(Local) Wed, 24 Jul, 2019

ఆధార్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

July 05, 2019,   11:17 AM IST
Share on:

గురువారం లోక్‌సభలో ఆధార్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్యనే ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తాజా సవరణతో ఇకపై ఆధార్‌కార్డును గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం దక్కింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు ఇకపై ఆధార్ కార్డును గుర్తింపు కార్డుగా స్వచ్ఛందంగా వినియోగించుకోవచ్చు. అయితే, ఈ విషయంలో ఆధార్ కార్డు కోసం ఆయా సంస్థలు వినియోగదారులపై ఒత్తిడి చేయడానికి వీలు లేదు. కాగా ఆధార్ చట్ట సవరణలో పారదర్శకత లోపించిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.