(Local) Sun, 27 Sep, 2020

అక్టోబర్ లో వస్తున్నా కార్తీ 'ఖైదీ'......

August 26, 2019,   11:33 AM IST
Share on:
అక్టోబర్ లో వస్తున్నా కార్తీ 'ఖైదీ'......

డ్రీం వారియర్ పిక్చర్స్, వివేక్ ఆనంద పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న చిత్రం 'ఖైదీ'. తమిళ్ హీరో కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఫస్ట్ టైం లారీ డ్రైవర్ గా పక్కా మాస్ పాత్రలో కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ‘పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుండగా చేతికి ఉన్న సంకెళ్లతోనే తప్పించుకొని ఓ లారీతో సహా కార్తీ తప్పించుకు పారిపోవడం, దీంతో పోలీసులు అతడి కోసం వెతుకుతుండడం జరుగుతుంది. మరోవైపు ఒక రౌడీ బ్యాచ్ కూడా కార్తి కోసం వెతుకుతుంటారు. అతడిని చంపితే జీవితాంతం సరిపడా డబ్బులిస్తామని చెబుతారు. దీంతో ఓ వైపు పోలీసులు, మరోవైపు రౌడీలు వెతుకుతుండం, చివరకు ఏమైందనేదే సినిమా కథ అనేది మనకు టీజర్ ని బట్టి కొంత అర్ధం అవుతుంది. అయితే ఈ సినిమా మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుందని అంటున్నారు. ఇక టీజర్ లో వచ్చే నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా ఉండడం, అలానే టీజర్ చివ‌ర్లో చికెన్ తింటూ కార్తి కనబరచిన నటన ఎంతో బాగుంటుంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఓ పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేసింది. టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో థ్రిల్ కలిగించిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది.  ఈ చిత్రానికి సీఎస్ సామ్ సంగీతాన్ని అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు…!!

సంబంధిత వర్గం
మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు
మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.