(Local) Thu, 14 Nov, 2019

రజినీతో నటించాలనుంది: కాజల్

October 19, 2019,   5:39 PM IST
Share on:
రజినీతో నటించాలనుంది: కాజల్

20017లో తేజ దర్శకత్వంలో  'లక్ష్మి కళ్యాణం' సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ తెలుగులోకి తెరంగ్రేటాం చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది కాజల్‌ అగర్వాల్‌. తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు భాషల్లోను సీనియర్ స్టార్ హీరోలతోను .. యువ కథానాయకులతోను కలిసి నటించింది. తెలుగులో చిరంజీవితో చేసిన ఆమె తమిళంలో కమల్ సరసన నాయికగా 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తోంది. దాదాపు అగ్ర స్టార్స్ అందరితోనూ నటించిన కాజల్ కి మాత్రం ఒక వెలితి ఉందట. తమిళంలో అజిత్ .. విజయ్ వంటి స్టార్ హీరోలతో హిట్ మూవీస్ చేశాను. కమల్ సార్ తో 'ఇండియన్ 2' చేస్తున్నాను. ఇన్నేళ్ల నా కెరియర్ లో రజనీకాంత్ జోడీగా ఛాన్స్ రాలేదనే వెలితి ఒక్కటి వుండిపోయిందని నటి కాజల్ అగర్వాల్ తెలిపింది. త్వరలో రజనీ సరసన ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొంది. రజనీ సరసన నటించాలనే కాజల్ కల ఎప్పుడు నిజమవుతుందో చూడాలి మరి.

సంబంధిత వర్గం
‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న నలుగురు సూ ...
‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న నలుగురు సూ ...
ముచ్చటగా మూడోసారి తలైవా తో....
ముచ్చటగా మూడోసారి తలైవా తో....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.