(Local) Thu, 14 Nov, 2019

సఫారీల ముందు భారీ స్కోర్ - ప్రస్తుతం 9/2

October 20, 2019,   5:08 PM IST
Share on:
సఫారీల ముందు భారీ స్కోర్ -  ప్రస్తుతం  9/2

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. రోహిత్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ సఫారీలముందు భారీ స్కోర్ నిలిపింది. అతనికి తోడు రహానే సెంచరీ కొట్టి సఫారీలకు రోహిత్ శర్మ తో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా కూడా మరో సారి అర్థశతకంతో ఆకట్టుకున్నాడు. చివర్లో ఉమేష్ యాదవ్ 10 బంతుల్లో 31 పరుగులు చేసి సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మొదటి రోజు పది ఓవర్ లకే మూడు కీలక వికెట్ కు కోల్పోయిన భారత్ ను రోహిత్ ఆదుకున్నాడు. రహానేతో కలిసి మొదటి రోజు ఇన్నింగ్స్ నడిపించాడు. రెండో రోజు మొదటి సెషన్ లో ఇద్దరు సఫారీలను ఎదుర్కొని పరుగులు రాబట్టారు. రహానే శతకం పూర్తయ్యాక పెవిలియన్ చేరాడు. రోహిత్ మాత్రం తన విధ్వంసాన్ని కొనసాగించాడు.మొదటి రోజు సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ డబుల్ సెంచరీని కూడా ఏమాత్రం భయపడకుండా సిక్సర్ తో చేయడం విశేషం. అతను అవుట్ అయ్యాక సాహా, జడేజా, అశ్విన్ కొంచెపటికే పెవిలియన్ చేరారు. చివర్లో ఉమేష్ మెరవడంతో స్కోర్ 497 /9 దగ్గర డిక్లేర్ చేసింది. సఫారీ బౌలర్లు మొదటి రోజు మొదటి గంట తరువాత పట్టు విడిచారు. దీంతో రోహిత్, రహానే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసారు. ముఖ్యంగా స్పిన్నర్లను ఈ జోడి టార్గెట్ చేసి పరుగులు రాబట్టారు.

అనంతరం ,తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. భారత పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా జట్టు సింగల్ డిజిట్‌కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. పేసర్ మొహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే డీన్‌ ఎల్గార్‌ పరుగులేమి చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత డికాక్‌ (4).. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇద్దరు కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చారు. అనంతరం మరో మూడు ఓవర్ల పాటు డుప్లెసిస్, హంజాలు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ సమయంలో బ్యాడ్‌ లైట్‌ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. క్రీజులో హంజా (0), డుప్లెసిస్‌ (1) ఉన్నారు.
 

సంబంధిత వర్గం
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను  ప్రారంభించిన  కెటిఆర్‌
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రారంభించిన కెటిఆర్‌

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.